మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి

చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నాను, నిరసిస్తున్నాను, ఆ నిర్ణయానికి ఫలితం చేదుగానే ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. అయితే, నేడు తెలంగాణాలో మగధీర సినిమాను ఆడనివ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పోకడలు రాన్రాను తెలంగాణా రాష్ట్రానికి దురదృష్టకరంగా పరిణమిస్తాయి అని ఇక్కడ మనం గమనించాలి.

అత్యవసరంగా రాజకీయాలను పాలనకు సంబంధించని విషయాల నుండి వేరు పరచవలసిన అవసరం ఉన్నది. మగధీర రెండు తెలుగు రాష్ట్రాల (ప్రాంతాల) గౌరవానికి సంబంధించినది, మనందరం గర్వపడవలసిన సినిమా. చిరంజీవి, రామ్ చరణ్ తేజ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు.

ఇంట్లో కుటుంబంతో ఉద్యమం ఎంత హాస్యాస్పదమో, సినిమాలతో కూడా అంతే. కళకు సరిహద్దులు లేవు. హాలీవుడ్, హిందీ, డబ్బింగ్ సినిమాలను ప్రోత్సహిస్తున్నప్పుడు తోటి తెలుగు వాడి సినిమాను బహిష్కరించడం అన్నది సిగ్గుతో తలదించుకోవలసిన విషయం.

మన కష్టాలన్నింటికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులే కారణం కాదు, నేడు జై తెలంగాణా అని చేతులెత్తి నినదించే వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. చరిత్రను మరొక్కసారి చదవాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణా ఫ్యూడల్ శక్తులను కలలో కూడా మరువరాదు.

మౌళికంగా మనది ఆంధ్ర జాతి, తెలుగు వాళ్ళం.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ప్రాంతీయ వివక్ష, నదీ జలాలు, ఆర్ధిక మరియు కట్టుబాట్లకు సంబంధించినది మాత్రమే అని మనం మరువరాదు.

ఇది సంయమనం పాటించవలసిన సమయం.

This entry was posted in సంసారం and tagged . Bookmark the permalink. Both comments and trackbacks are currently closed.

7 Comments

  1. surender
    Posted December 18, 2009 at 5:47 AM | Permalink

    well said

  2. raamudu
    Posted December 18, 2009 at 7:24 AM | Permalink

    మీ గొంతు అందరికి శంఖారావంలా వినిపించాలి

  3. evaro
    Posted December 18, 2009 at 10:47 AM | Permalink

    Finally I read a sensible message from talangana supporter thanks

  4. Ali
    Posted December 18, 2009 at 11:16 AM | Permalink

    I Totally agree with you

    Ali

  5. Rath
    Posted December 20, 2009 at 8:17 PM | Permalink

    @నాగన్న : I agree with you as we are more matured than Chiru to accept all movies on the earth no matter which region, which language etc.. Only we care is if the movie is good or not!

    But as an artist Chiru should know that 40% of his wealth came from Telangana and I expect at least 40% of his heart should think about telangana people.. he said ‘Samajika Telangana’ earlier… now he is saying samaikya Andhra. Can he adopt a small village in telangana to give flouride free water??

  6. Posted December 21, 2009 at 10:56 PM | Permalink

    @అందరికి
    థాంక్స్

  7. Posted December 22, 2009 at 6:32 AM | Permalink

    సినిమాలూ, నిజజీవితం వేర్వేరు విషయాలైతే సినిమా నటులకి రాజకీయాలు ఎందుకు? సినిమా నటులు సంకోచం లేకుండా తెలంగాణా వ్యతిరేక ప్రకటనలు చేశారు కాబట్టే టి.ఆర్.ఎస్. కార్యకర్తలు సినిమా థియేటర్ల పై దాడులు చేసి రీళ్ళు తగలబెట్టారు. చిరంజీవిని నమ్మి మోసపోయిన తెలంగాణా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలైనా అర్థం చేసుకుని ఉంటారు, రాజకీయాలకి సినిమా గ్లామర్ పనికి రాదని.