గత రెండు వారాలుగా జరుగుతున్న సంఘటనలకు నా మనసు చాలా బాధ పడింది. సరిగా నిద్ర కూడా పట్టలేదు.
అటు తెలంగాణా ప్రాంతంలో అమాయక విధ్యార్ధుల చావులు, ఇటు మిగతా ప్రాంతాల్లోని ప్రజల ఆవేదన నన్ను ఎంతో కదిలించాయి. ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ రాయలేకపోయాను… ఇప్పటికీ కష్టంగానే ఉంది. రాష్ట్రం ముక్కలు అవుతుంది అన్న ఆవేదనను ప్రజల కళ్ళలో చుసినప్పుడల్లా నాకు విపరీతమైన వేదన కలిగేది, కానీ వాస్తవం కళ్ళ ముందు గుర్తుచేసుకున్నప్పుడల్లా నిభాయించుకోగలిగాను.
గత యాభయ్యేళ్ళుగా టిబెట్ దేశంలో పుట్టిన వారికి తమ ప్రాంతం గురించి ఎంత పరిజ్జానం ఉందో, తెలంగాణాలో పుట్టిన అత్యధికులకు తమ ప్రాంతం గురించి దాదాపుగా అంతే పరిజ్జానం ఉంది. అందుకు (గతంలో) నేను ఒక పెద్ద ఉదాహరణ. తెలుగు పుస్తకాలు చదివే నాకు తెలంగాణా చరిత్ర గురించి , రాష్ట్రం గురించి నాకు అవగాహన రావడానికి ఏళ్ళు పట్టింది – మిగతా ప్రాంతాల వారిని నేను తప్పు పట్టదలుచుకోలేదు.
తెలంగాణా రాష్ట్రం అనే పదాన్ని ఎవరూ ఎత్తకుండా, ఆంధ్ర రాష్ట్రం ఒక్కటిగా ఉండాలంటే, ఇంకా (ఒక్క) మార్గం మిగిలే ఉంది…
అయితే ప్రస్తుతం ఒక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానాన్ని మనం తెలుసుకోవాలి. తెలంగాణా ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉన్నది అన్న విషయాన్ని గుర్తించాలి. అయితే,దానిని గుర్తించడం కానీ, గౌరవించడం అన్నది 50 ఏళ్ళలో ఇంతవరకు జరగలేదు. తెలంగాణా అంటే హైదరాబాదు ఒక్కటే కాదు, ఎన్నో పట్టణాలు పల్లెలు ఉన్నాయి, అయితే అవి శతాబ్దాలుగా నిరాదరణకు, నయవంచనకు గురౌతున్నాయి.
చితికిపోయి బ్రతకడం అన్నది ఎవరికీ కొత్త కాదు. ఎవనికో పుట్టిన ముస్లిం పాలకుడు ప్రజలను చిత్రహింసలు పెడితే భరించవచ్చు కానీ, తెలుగు భాష పేరు చెప్పి దగాకోరుతనాన్ని చూపిస్తే తట్టుకోవడం కష్టం. తెలంగాణా ప్రజలు తమ భవిష్యత్తు మీద ఆశను ఎప్పుడో వదులుకున్నారు. అందుకే నీళ్ళ కోసం కానీ న్యాయం కోసం కానీ ఎక్కువ ర్యాలీలు, ధర్నాలు చెయ్యరు. మద్రాసుకు కానీ, కడపకు కానీ నీటిని తీసుకుపోయినా కాంగ్రెస్, తెలుగు దేశానికి చెందిన ద్రోహులకు మరుమాట్లాడకుండా ఓట్లేస్తారు.
సినిమాలు, పత్రికలు, రాజకీయాలు, కులాలు, ఫ్యాక్షన్లు అన్నీ ఆంధ్ర, రాయలసీమ ప్రజలు వంతుల వారీగా వాడుకోవడమే తప్ప తెలంగాణా ప్రాంతం వారికి అందులో ముప్పయ్యవ భాగం కూడా లేదు. ఇది విదేశీయులకు, పరాయు రాష్ట్రాల వారికి, ఢిల్లీలో ఉన్న వారికి తెలిసినంతగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వాసులకు తెలియదు. తెలంగాణా జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. స్వయంగా చూస్తే కానీ అర్థం కాలేదు. పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు.
మీరెప్పుడయినా తెలంగాణా జిల్లాల కష్టాలకు సంబంధించిన టీవీ ప్రోగ్రాములు చూశారా? వివరాలు పంపించగలరు.
ఆంధ్ర రాష్ట్రం ఒక్కటిగా ఉండాలంటే చిట్టచివరి మార్గం ఒకటి ఉంది. స్వంత లాభాన్ని కొంత మానుకొని రాజకీయ నాయకులు వేగంగా ఆత్మ పరిశీలన చేసుకోని, తెలంగాణా ప్రజల అవసరాలను కనుగొని, నీటి ప్రాజెక్టులను, అవసరాలను తీర్చే పనులను వరుసగా మొదలుపెట్టాలి. చిత్తశుద్ధితో గౌరవంగా మనసును గెలుచుకునే ప్రయత్నాలు చెయ్యాలి. అంతే కానీ, బస్సులు, అద్దాలు పగులగొట్టడం వంటి హింసాత్మక చర్యల ద్వారా ఏమీ సాధించలేరు.
ప్రాణాలను పణంగా పెట్టి చేసిన దీక్షతో కేసీయార్ తెలంగాణ ప్రజల గుండెల్లే శాశ్వతంగా నిలిచిపోతారు. ఆయన్ని అవమానించడం తెలంగాణా ప్రజలను, వారి ఆశయాలను అవమానించడం అన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
Hatred is never appeased by hatred in this world. By non-hatred alone is hatred appeased. This is a law eternal – గౌతమ బుద్ధుడు.
అయ్యా,
నేను కర్నూలులో పుట్టి గత 23 (out of 25) ఏళ్ళగా హైదరాబాదులో ఉన్నవాడిని..మూడు ప్రాంతాలలో కొద్దో గొప్పో తిరిగిన వాడిని..
తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరిగింది అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తున్నాను..కాని ఒక్క విషయం చెప్పండి…
తెలంగాణా ప్రాంతం నుంచి ఇంత మంది “ప్రజా ప్రతినిధులు ” ఉన్నారు కదా…ఇంత కాలం అన్యాయం జరుగుతు ఉంటె ఏం చేసారు?? నిజంగా ఈ నాయకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటె ఈ వేర్పాటు కుంపటి వొచ్చేది కాదు కద…అన్యాయం జరుగుతున్నప్పుడు నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూసారు మన తెలంగాణా నాయకులు…కొత్త రాష్ట్రం వొచ్చినా నాయకులు వాళ్ళే కదా…..ఈ నాయకుల వలన రాష్ట్రం ముందుకి వెళ్తుంది అనే నమ్మకం మాత్రం అణుమాత్రం కూడ లేదు…
ఏ ప్రాంతపు రాజకీయ నాయకులలో అయినా..దేశభక్తి ఉంది అంటె చచ్చినా నమ్మను…ఎవడి స్వార్థం వాడు చూసుకోవటమే కాని..ప్రజల పక్షాన పోరాడిన నాయకులని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు..
ఇకపోతే ఇక్కడ స్థిరపడిన వాళ్ళ గురించి…వాళ్ళ గుండెల్లో అభద్రతా భావం పెఱిగిపోయింది..రెచ్చ గొట్టే నినాదాలు..రెచ్చ గొట్టే చేష్టలతో మన ఉద్యమ కారులు కొని తెచ్చుకున్న కుంపటి కాదా ఇది?? ఆంధ్రా వాలా భాగో…నిన్న లాయర్ల దాష్టీకం (tappu iru pakshaaladi ayinaa) ..రాబోయే రోజుల samples మాత్రమే…కాదంటారా??
తెలంగాణా అభివృద్ధి కావాలి కాని…రాష్ట్రం విడిపోయి ఎటు కాకుండా పోతుంది అంటే..ఈ ఉద్యమం ఎందుకు పనికి రాని ఉద్యమం గానే చరిత్ర లో మిగిలిపోతుంది…
నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే..వొచ్చే నాలుగేళ్ళలో ఫ్లొరైడ్ సమస్యని అదుపు చెయలేమంటారా??
కనీసం మూడు లక్షల ఎకరాలకి నీళ్ళు అందించలేరంటారా??
ఈ నాయకుల చదరంగంలో బలయ్యేది ప్రజలే అండి…. :-(
ఇట్లు,
జీవితం మొత్తం తెలంగాణా లో ఉన్నా సమైఖ్యం గా అభివృద్ధి సాధించాలి అని భావించే వాడిని..
P.S: [ఆ మధ్య ఒక తెలంగాణా బ్లాగరి బ్లాగు లో ఇలా కమెంటానని కనీసం publish కూడా చెయలేదు ..ఇప్పుడు కూడా నమ్మకాలు లేవనుకోండి..కనీసం "post-author" అయినా ఇది చూడకపోదులే అనే చిన్న ఆశ]
chaalaa baagaa cheppaaru…. nijamea … vaaLLu poataam anTea aapaTaaniki manam evuram..
సినిమా రంగంలో తెలంగాణా వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ప్రముఖ సినిమా నటుళ్ళో తెలంగాణా వాళ్ళు ఇద్దరే. వారు కాంతారావు (కోదాడ, నల్లగొండ జిల్లా), ప్రభాకరరెడ్డి (తుంగతుర్తి, నల్లగొండ జిల్లా). మిగిలిన ప్రముఖులు కోస్తా ఆంధ్రవాళ్ళే.
100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.
what you said about the problems are true, these are the problems faced not oly in telangana but also in all rural parts of india, GETTING SEPERATED IS NOT THE SOLUTION TO THE PROBLEM”, JUST KNOW HOW PEOPLE WWHO GET DAILY WAGES ARE AFFECTED BY THE AGITATION STARTED BY kcr, because of the this problem raised oue develpmant went back for 10 years.
we must think about our national integration. Now so many are asking for formation of new states, this is nothing but division of united india and IMMEDIATE THREAT FROM CHINA.
if there is no integration of states from where can you get the development.
TELANGANA PROBLEM CAN BE SOLVED BY STRENTHENING OF REGIONAL DEVELOPMENT BOARDS, people should vote, people sholud always question their MLA and MP whom they have elected , what will they do for 5years TO THEM, WHAT HAVE DO DONE FOR US IN THESE 5 YEARS SO THAT WE WILL HAVE TO ELECT YOU AGAIN?
ASKING FOR SEPERATE STATE MEANS
1. ASKING FOR POWER, new ministries.
2. GETTING FUNDS FROM GOVT. NOT FOR DEVELOPMENT BUT FOR THEIR GREED, more money.
FIGHT WITH THE MP’S AND MLA’S , USE YOUR ENERGY ,QUESTION THEM IF YOU HAVE ELECTED,
DO NOT WASTE YOU ENERGY BY ASKING FOR SEPERATION ” SEPERATION IS A SIN”
యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
see this link for answer
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html
@chaitu: రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది.
@dora babu: చాలా థాంక్స్
@Praveen Sarma: చాలా థాంక్స్
@రహంతుల్లా: బాబా గారు మీకు సమాధానం చెప్పారు కదా!
@samhita: If ” SEPERATION IS A SIN” then what DISCRIMINATION is?
ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశం గురించి ఆలోచించాల్సి సమయమిది. తెలుగోడికి స్వాతంత్ర్యం రావాల్సిన సమయం ఆసన్నమైందనుకుంటా
రవి,
జరుగుతున్న సంఘటనల వల్ల కులాంధ్ర, ప్రాంతాంధ్ర, ఫ్యాక్షనాంధ్రలు ముందు దెబ్బతింటున్నాయి.
ఇక ముందు ప్రజల అభిప్రాయాల విలువ పెరిగి మంచికి దారితీస్తుంది అని ఆశిద్దాం.
@samhita garu: I do not understand your logic “we must think about our national integration. Now so many are asking for formation of new states, this is nothing but division of united india and IMMEDIATE THREAT FROM CHINA.”
According to your theory, All India should be one state, so that we can save lot of money on removing all state govts, stage ministers etc..
USA has 50 states, does that mean it is more vulnarable for outside threats? Telangana agitation was not started by KCR, it was there for decades..
There are many states in India not even half of Telangana..