ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే?

నిన్న మధ్యాహ్నం న్యూజెర్సీ నుండి స్నేహితులు ఫోన్ చేశారు.
అంతా కలిసి మూడు గంటల పాటు ధ్యానానికి కూర్చోబోతున్నారట.

మాటలో మాటగా గురువు గారు బ్రహ్మర్షి పత్రీజీతో జరిగిన సంభాషణను చెప్పడం జరిగింది.
ఫోన్లో మాట్లాడుతూ పత్రీజీ గారిని అమెరికాకు రామ్మని ఆహ్వానించాడట.
అమెరికా వస్తే ఏం ఇస్తావు అని అడిగితే,
ఏది కావాలంటే అది ఇస్తాను సార్ అని జవాబిచ్చాడట.
కొండ మీది కోతిని తెస్తావా అని ఆయన అడిగారట.

ఇది విన్న వెంటనే,
ఆయన ఎవరినీ ఏ ప్రతిఫలం అడగరని నాకు బాగా తెలుసు కాబట్టి,
రెండు క్షణాలు ఆలోచించి..
అప్పటికప్పుడు ఇలా వివరించాను:

కొండ అంటే రెండర్థాలు ఉన్నాయి; ఒకటి అందరికి తెలిసినదైతే, రెండోది శరీరం అని.
మచ్చుకు, చిన్న పిల్లలను బంగారు కొండ, బుజ్జికొండ, చిట్టికొండ అని పిలవడం మనకు తెలుసు కదా.

కొండ (శరీరం) మీద ఉన్నది, దాని అధిపతి ఎవరంటే అది మనసు.
మనసును కోతితో పోల్చడం గురించి ధ్యానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఈ కొండపై ఉన్న కోతిని (మనసును) తేవాలంటే, ముందు పట్టుకోవాలి, అంటే మనసును నిలపాలి.
అప్పుడు మాత్రమే కోతిని తెచ్చే(నియంత్రించడం) ప్రయత్నం చెయ్యగలం.

సార్ ఉద్దేశ్యం అదే కావచ్చు అని ముగించాను.

This entry was posted in నిర్వాణం and tagged , , . Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

7 Comments

  1. POKIRI
    Posted January 2, 2010 at 1:14 AM | Permalink

    GOD!!!!!!!!!

    MIND BLOCKED

  2. Posted January 2, 2010 at 2:03 AM | Permalink

    good one!

    23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
    http://creativekurrodu.blogspot.com/

    Happy New Year :)

  3. SPN Bhaskar
    Posted January 2, 2010 at 4:56 AM | Permalink

    నాగన్న గారూ,

    ధ్యానం మీద మీర్రాసే టపాలన్నీ బాగున్నాయి, అభినందనలు

    నేనూ పత్రి గారి చాలా ధ్యాన సమావేశాలకు వెళ్ళాను, అయన ఒక మార్మిక గురువు అని నమ్ముతాను, శిష్యులు అనే మాట అయన వాడక పోవడానికి ఆయన సామూహిక ఆత్మను ఊద్దరించడమే పనిగా పెట్టుకున్నారనుకుంటా, ఆయనకు ఒక పెద్ద మూడో కన్ను ఉన్నదన్న విషయం మరువరాదు, ఒక మనిషి భౌతిక(Physical), బౌద్ధిక(Thoughts), హృదయిక(Feelings), ఆత్మిక (Soul) స్తాయి లన్నీ ఆయనకు ఒక్క చూపుతొ ( ఆ మాటకొస్తే మూడో కన్నున్న వాళ్ళం దరికీ) అర్దమౌతాయి, మన స్థాయికి తగ్గ సమాధానన్నే ఆయన దగ్గర పొందగలం, కేవలం నా ఆలోచన మీతో పంచుకుంటున్నాను

    దివ్య ఆత్మ విద్యా జయహో, జయహో
    ధన్యవాదాలు

  4. Posted January 5, 2010 at 10:19 PM | Permalink

    @అందరికి నెనరులు

  5. Posted January 6, 2010 at 2:20 AM | Permalink

    Hello ,As pe the psycology it is the Spontanious word came out by mr pathri so there may not be in such depth meaning by him , i feel really sorry to speak in such but when a person is speaking to an elderly person like Mr Pathri should have control over words should not speak a word like (edina ista) because we are not god to operate the sutuations like Vishnu, cannot create the workd like Bhrhma , cannot distroy the Evil or the world problems, we are having limitations and rules of life

    that is life cycle

    birth,responsibilities ,death this cycle is for everyone in the world
    but your part is to make the cycle standardise,be a good son, good Husband,good father,so that the nent genetation may follow you,

    this is the one we have learned from our previous generation and it is our duty to promote to our next generation

    Sarvey jana Sukinobavantu

  6. Posted January 7, 2010 at 10:52 AM | Permalink

    రమేషు, అసలు విషయం అర్థం అయింది కదా! పూర్తి సమాధానం రాయాలంటే, ఒక పుస్తకం తయారవుతుంది. కామెంటుకు చాలా సంతోషం.

  7. Rambhoopal
    Posted January 24, 2010 at 7:55 PM | Permalink

    Good interpretation.

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>