బ్లాగు రాతలు – 1

అసలు బ్లాగు ఎందుకు రాయాలో అర్ధం కాక ఈ మధ్య చాలా కాలం మౌనంగా ఉండాల్సి వచ్చింది….
అసలు బ్లాగును ఎవరైనా ఎందుకు రాస్తారో?

ఇంగిలిపీసులో రాసినా రాయకపోయినా ఆఫీసు, ఇంటర్నెట్టు కారణంగా ఆ లిపిని మరిచిపోము,
కానీ తెలుగులో వ్యవధి వస్తే కీబోర్డును గుడ్డివాడిలా తడిమి మళ్ళీ నేర్చుకోవాలి…

ఈ బ్లాగు ఎందుకు రాయాలి అనే సందేహం ఉంది కానీ, ఏమి రాయాలి అనే విషయంలో లేదు…

తెలుగులో చాలా మంది రాస్తున్నారు కాబట్టి మనం ఏదో ఉద్దరించాలి అన్న యావ కూడా పోయింది.

తెలుగు బ్లాగులు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూసే ధైర్యం, ఓపికా రెండూ లేవు…
కాలం మనను ఎంత మారుస్తుంది…!
హ్మ్…

4 Comments

  • బ్లాగు రాసి ఎవర్నో ఉద్ధరిస్తా మనుకోవడం వొట్టి భ్రమ.
    గొప్ప గొప్ప రచయితలు తాము చెప్పాల్సింది ఏదో ఉన్నది, అది చెప్పి తీరాలి అన్న తపనతో రాస్తారు.
    మనలాంటి మామూలు రచయితలు – అంత లేకపోయినా – ఏదో ఒక స్వప్రయోజనం ఉండబట్టే రాస్తారు. కారణం ఏదైనా చివరకి అది రాసేవాడికి తృప్తినివ్వాలి. అది కలగడం మానేసినప్పుడు ఆ ఆసక్తి పోతుంది. అది కేవలం కాలం ప్రభావమా?

  • “కారణం ఏదైనా చివరకి అది రాసేవాడికి తృప్తినివ్వాలి. అది కలగడం మానేసినప్పుడు ఆ ఆసక్తి పోతుంది” అని చాలా బాగా చెప్పారు.
    బ్లాగుల వల్ల మీ లాంటి గొప్ప రచయితలతో ఇలా మాట్లాడే అవకాశం కలగడం మాత్రం మహదానందమే! నెనర్లు.

  • D.Nayani wrote:

    Do what feels right for you.