బ్లాగు రాతలు – 3

తెలుగులో బ్లాగు రాయడం వలన ఎంత లాభం పొందాను అన్నది ఒక పెద్ద ప్రశ్న?
అయితే, వందల గంటలను వెచ్చించడం వల్ల భాష పరిజ్ఞానం అన్నది కొంత పెరిగింది.
…లేకపోతే, ఇంగిలిపీసు సదువులకు మొత్తం బూడిదపాలయ్యేది.

బతుకు తెరువు కోసం పోరాటాలు చేసేవారికి, సంసారంలో నిండా మునిగిన వారికి,
తెలుగు భాష సాధన,శోధన పెద్దగా లాభాలు పండించే విద్య కాదన్నది చేదు నిజం!
నేడు తెలుగులో రాసుకోవాలంటే, ఒక స్థాయిలో ఆశయం/సంకల్పం ఉండటం అవసరం.

మన జీవితానికి, మన రాతలకు ఎంత దూరం ఉంటే, మనసులో అంత రాపిడి,
ఎంత దగ్గరగా ఉంటే అంత ఆనందాన్ని పొందుతాము అనుకుంటాను.
లేకపోతే పూర్తిగా కామెంట్ల సంతృప్తితోనే ఆ లోటును భర్తీ చేసుకోవాల్సి వస్తుంది… కావచ్చు.

బ్లాగులు రాయడం వల్ల ప్రాపంచికంగా పెద్దగా పొందక పోయినా,
జీవితానికి పనికి వచ్చేది, ఆధ్యాత్మికంగా ఒకటి మాత్రం తప్పకుండా పొందుతాము.
మన ఆలోచనలను పరిశీలించి,  మనను మనం అర్ధం చేసుకోవడంలో ఒక మెట్టును ఎక్కడం.

This entry was posted in సంసారం and tagged , . Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

3 Comments

  1. Posted June 18, 2010 at 11:05 AM | Permalink

    “మన ఆలోచనలను పరిశీలించి, మనను మనం అర్ధం చేసుకోవడంలో ఒక మెట్టును ఎక్కడం.”

    కరెక్ట్. నన్ను నేను మరింత అర్ధం చేసుకోవడం కోసం కూడా నేను బ్లాగులు వ్రాస్తుంటాను.

  2. Posted June 18, 2010 at 1:40 PM | Permalink

    కొన్ని టపాలు వ్రాయటానికి కొంత పరిశోధన కూడా అవసరమౌతుంది. ఈ ప్రక్రియలో బ్లాగరు తాను కొత్త విషయాలు తెలుసుకుని పాఠకులకు ఆ సమాచారాన్ని అందచేస్తాడు. టపా వ్రాయటంలో, చదవటం లో బ్లాగరు, పాఠకుడు ఇద్దరూ లాభం పొందుతారు కొన్ని చింతనాత్మక వ్యాసాల వల్ల.

    cbrao
    Mountain View (CA)

  3. Posted June 18, 2010 at 7:31 PM | Permalink

    మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు నెనర్లు.

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>