కొత్త సంవత్సరం నిర్ణయాలు…హితం

గత పది రోజులుగా (ఆన్లైనులో) గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన ధ్యాన మహాచక్రం కార్యక్రమాలను విరివిరిగా చూసాను.

వివిధ సాంస్కృతిక, ధ్యాన సంబంధిత కార్యక్రమాలు ఎంతో అలరింపజేసాయి, ఆలోచింపజేసాయి. అనేకానేక స్థాయిలకు చెందిన వందలాది మంది స్త్రీ, పురుష సాధకులు స్టేజీపై తమ ఆరోగ్యాన్ని మందులు, డాక్టర్లు లేకుండా కేవలం ధ్యానంతో పరిష్కరించుకున్నారో చెబుతుంటే నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది, సరికొత్త ఉత్తేజాన్ని కలిగించింది.

ప్రపంచం అంతా ధ్యానం, ధర్మం (అహింస, శాఖాహారం) ప్రచారం కావాలని అనుకోవడం నా దృష్టిలో ఒక అత్యున్నతమైన ఆశయం. కుల మత వర్ణ వర్గ రహితంగా ఒకే చోట లక్షలాది మంది ప్రజలు ఇలా ఒక ఆశయం కోసం బ్రతకడం అన్నది చరిత్రలో అరుదుగా జరుగుతుంటుంది. దీన్ని గమనించడమే ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.

కొత్త సంవత్సరం మొదలయ్యింది, కొత్తదనం ఎప్పుడూ ఉత్తేజితం కలిగిస్తుంది. పెళ్ళికొడుకు అయినా, బిచ్చగాడైనా, తెలుగు బ్లాగరైనా కొత్తదనాన్ని స్వయంగా అనుభవించి, గమనించే ఉంటాడు. అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు కొత్తదనంతో పాటు పోవడాన్ని మనం గమనించే ఉంటాం. ఈ విషయంలో నేను ఎంతగా విఫలం అయ్యానంటే, కొత్త నిర్ణయాలను తీసుకోవడం ఎప్పుడో మానేసేటంతగా.

అయితే, అందరు తెలుగు బ్లాగర్ల వయసు నాలా నాలుగు దశాబ్దాలకు దగ్గరగా ఉండకపోవచ్చు కాబట్టి యవ్వనంలో ఉన్న వాళ్ళకు ఒక ఉచిత సలహా పడేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒకసారి మీ స్నేహితులను గమనించండి. మనం ఏమిటి అన్నది మన స్నేహితులను బట్టి తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు మనం ప్రోగ్రామర్/సంగీతజ్ఞులం అనుకుందాం, మన స్నేహితులలో కనీసం ఒకరు ప్రోగ్రామింగ్/సంగీతంలో నిష్ణాతులు అయి ఉంటారు. అలా లేకుండా మనం ప్రోగ్రామింగ్/సంగీతంలో అభివృద్ధి సంపాదించడం అన్నది అసంభవం. మనకు జీవితం గురించి తెలుసుకోవాలంటే, జీవితం గురించిన స్నేహితులు ఉండాల్సిందే, అలా లేకుండా ఆ సబ్జెక్టులో నిష్ణాతులం కావడం నా దృష్టిలో అసాధ్యం.

ఈ ఫార్ములా మరే విషయంలో అయినా వర్తిస్తుంది. ఇది అనుభవ సారాంశం. కాబట్టి కొత్త సంవత్సరం ఏదైనా కొత్త పని చెయ్యాలంటే, కొత్త స్నేహితాలను వెతుక్కోవలసిందే!

తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు కానీ, సరైన స్నేహితం లేకుండా ఇవి ఏవీ పూర్తిగా ఫలవంతం కావు అనేది నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి కొత్త సంవత్సరంలో ఏం చెయ్యాలి అనుకున్నారో, వాటికి సంబంధించి స్నేహితులను వెతుక్కోండి, నేను కూడా అదే పని చేస్తాను. స్నే-హితంలోనే హితం ఉంది.

హ్యాపీ న్యూ ఇయర్ 2011.

This entry was posted in సంసారం. Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

2 Comments

  1. సూర్యుడు
    Posted December 31, 2010 at 11:26 PM | Permalink

    Wish you a very happy and prosperous new year, 2011

    ~సూర్యుడు

  2. నాగన్న
    Posted January 1, 2011 at 3:53 AM | Permalink

    థాంక్స్ సూర్యుడు గారు.

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>