పత్రీజీతో ముఖాముఖి

గతంలో తెలుగు బ్లాగులలో బాబాలను, గురువుల గురించిన వేడి వేడి చర్చలు ఎన్నో జరిగాయి. బాబాలను విమర్శించిన వారు ఎవరు కూడా తగినంత ఆధ్యాత్మిక సాధన కానీ, జ్ఞాన సాధన కానీ చేసి అభివృద్ధి పొందిన దాఖలాలు నాకు కనిపించలేదు.

ఆధ్యాత్మికతకు కావలసిన మొట్టమొదటి గుణం నిజాయితీతో కూడిన స్వీయ పరిశీలన. వేమన గారు చెప్పినట్టు, తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎఱుగరు కాబట్టి, సాధారణంగా మనం ఎదుగుదలను ఆశించలేము.
బాబాలు సరా కాదా అన్నది తరువాతి సంగతి.

బ్లాగు పరంగా నేను చెప్పాలనుకున్నది సరైన విధంగా చెప్పలేకపోయాను. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ ఇంటర్వ్యూను ప్రచురిస్తున్నాను. బ్రహ్మర్షి పత్రీజీ గారి నుండి కొన్ని మౌలికమైన విషయాలను నేర్చుకునే అద్భుతమైన అవకాశం.

మొదటి భాగం:

రెండవ భాగం:

మూడవ భాగం:

This entry was posted in నిర్వాణం, సంసారం and tagged , . Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

9 Comments

  1. రామ్ కుమార్ ఓలేటి
    Posted December 20, 2010 at 1:21 AM | Permalink

    పత్రీజీ ధ్యాన మార్గం బోధిస్తూనే ఒక రాజకీయ పార్టీ పెట్టడంపై మీ అభిప్రాయమేమిటి? పిరమిడ్ నెత్తిన పెట్టుకుని ధ్యానం చేస్తే ఏకాగ్రత కలుగుతుందనడంలో నిజమెంత? చెక్క పిరమిడ్ తయారు చేసి అందులో ఆహార పదార్థాలు ఉంచితే చెడిపోవనడం ఎంత వరకూ కరెక్టు? ఇవన్నీ ఆయన ఫాలోయర్స్ చేస్తూంటారు. వీటన్నింటినీ ఆయన సపోర్ట్ చేస్తారా?

    -రామ్ కుమార్ ఓలేటి

  2. Posted December 20, 2010 at 2:21 AM | Permalink

    ఈ ప్రశ్నలు అడిగారు అంటే పైన ఉన్న రాత, వీడియోలను మీరు చూడలేదు లేదా అందులోని సారాంశం మీకు అర్ధం కాలేదు అని నా అభిప్రాయం.

  3. Posted December 20, 2010 at 4:19 AM | Permalink

    ఎకో బాలన్స్ ప్రకృతి చూసుకుంటుంది అన్న మాటకు ఇక తిరుగు లేదు. అద్భుతం!

    అన్నట్లు మౌళికమైన విషయాలను నేర్చుకునే … అని రాశారు. అక్కడ మౌలిక అని ఉండాలి. ఏమనుకోరుగా దిద్దినందుకు!

  4. lak
    Posted December 20, 2010 at 7:46 AM | Permalink

    great video & i Liked very much

  5. Posted December 20, 2010 at 9:34 AM | Permalink

    @సుజాత
    అవును. సరిదిద్దాను మాస్టారు, చాలా నెనరులు.

    @lak
    Thanks for your comment.

  6. Posted December 20, 2010 at 12:10 PM | Permalink

    విమర్శ అని కాదు కానీ పత్రి గారి బాడీ లాంగ్వేజ్ చాలా తేడాగా ఉన్నది. ఆయన చెప్పేదానికి, ఆయన బాడి లాంగ్వేజీకీ చాలా తేడా ఉన్నది. కష్టమే నమ్మటం!

    ప్రశ్నలు కొన్ని బాగున్నాయి – కానీ వాటికి చాలా గందరగోళక సమాధానాలు, “బీటింగ్ అరవుండ్ ద బుష్” లా, విజ్ఞానం పంచడానికి కాక ఆధిక్యత ప్రదర్శించేలా వున్నాయి.

    వీడియోలు చూడలేదనీ, అర్థం చేసుకోలేదనీ తిరుగు సమాధానం కోసం రాయట్లేదు ఇది.

    ఈ బ్రహ్మర్షిగారికి మీరు శిష్యులా? బాగుంది…ధన్యవాదాలు వీడియోలకు. ఇహ పూర్తిగా అర్థమయ్యింది…

  7. Posted December 20, 2010 at 1:57 PM | Permalink

    ఒక అపస్వరాన్ని పాడితే సంగీతం మాస్టారు విపరీతంగా కోపానికి గురి అవుతాడు. ఎందుకు, ఎలా అంటే వివరించడం కష్టం. అలాగే అల్ప జ్ఞానం కలిగిన వారి ప్రశ్నలకు ఒక ఆధ్యాత్మికం మాస్టారు అలాగే ఫీల్ అవుతాడు. ఎందుకు, ఎలా అంటే వివరించడం కష్టం. బాడీ లాంగ్వేజీకి సంబంధించి నాకు ఉన్నది మిడిమిడి జ్ఞానం మాత్రమే, కాబట్టి దాని గురించి ఎక్కువగా వ్యాఖ్యానించలేను.

    పత్రీజీ గారితో నా అనుబంధం ఒక విధంగా తండ్రి, కొడుకు లాంటిది – అంటే పైన టీవీలో అడిగిన ప్రశ్నలను నేను అడిగితే, నా దవడ వాచిపోతుంది అని అర్ధం. ఒక వేళ చెప్పినా, వీడియోలో ఆయన చెప్పినట్లు, అవి వేరే విధంగా ఉంటాయి అని మనం గమనించవచ్చు.

    నిజమైన గురువు సాధకునికి సమాధానాలు చెప్పడు, వెతుక్కునే మార్గం మాత్రమే చెబుతాడు. ఒక్కసారి సమాధానాలకు అలవాటుపడితే అనుభవజ్ఞానం రావడం చాలా చాలా కష్టం. నాకు అత్యంత ప్రీతి పాత్రమైన గురువు నాలోనే ఉన్నాడు :)

  8. Posted December 21, 2010 at 12:14 AM | Permalink

    మీ వ్యాఖ్య అర్థమైంది. పత్రి గారి సమావేశాలకు నేను రెండు మూడు సార్లు వెళ్లాను. నిజంగానే ఆయనకు కోపం చాలా చాలా ఎక్కువ! చంటిబిడ్డతో వచ్చిన ఒక తల్లిని ‘ఇలాంటి మీటింగ్స్ కి పిల్లాలతో వస్తారా”అని చీవాట్లు పెట్టారు. కొన్ని సార్లు abusive language కూడా వాడారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు నాకు నచ్చుతాయి. మధ్యలో అంతటి వారు ఇలా ప్రవర్తించడం అర్థం చేసుకోలేకపోయాను. పుస్తకాలు ఆయనే ఇచ్చారు నాకు…(నా పాటకు మెచ్చి:-))

    ఆయన కోపాన్ని మీ వంటి జ్ఞానులు అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయనేం చెపారో విందామని వచ్చిన సామాన్య మానవులకు ఈ ధోరణి అర్థం కాదు కదా సర్!

    అభ్యంతరమైతే వ్యాఖ్యను ప్రచురించకుండానే జవాబు ఇవ్వండి!

  9. నాగన్న
    Posted December 21, 2010 at 9:56 AM | Permalink

    నా దృష్టిలో ఆ కోపం ఒక మాస్క్ లాంటిది, ఏదో చూద్దాంలే అని వచ్చిన వారిని అది దూరంగా ఉంచుతుంది. బాగా ఆకలితో ఉన్న బిచ్చగాడిని పోరా పో అంటే వెళ్ళడు దీనంగా అక్కడే నిలబడతాడు, ఆకలి లేని వాడు కోపంతో వెళ్ళిపోతాడు.

    అహంకారం ఉన్న వారెవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చెయ్యరు, అది అసలు చిదంబర రహస్యం. అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదు. బహుశా అది చెప్పడానికే, బుద్ధుడు భిక్ష పాత్ర పట్టుకొని తిరిగి ఉంటాడు.

    2009లో కలిసినప్పుడు, నా సంగీతానికి మెచ్చి, ఆయన పిల్లనగ్రోవిని ఇచ్చారు. మీ పాటలు ఆన్లైన్లో ఉంటే లింకులు పంపించగలరు. సామాన్యునికి చివరకు రాళ్ళే గతి!

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>