గత సెప్టెంబరులో డాక్టర్ న్యూటన్ గారి వినాయక చవితి సందేశాన్ని ప్రచురించడం జరిగింది, మీలో కొందరు చదివి/చూసి ఉంటారు…
ఆ రోజు ఉదయం డాక్టరు గారి హిందీ టీవీ సీరియల్ డీవీడీ ప్రివ్యూలను మా ఇంటిల్లిపాదీ చూడటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలతో పునరాగత జీవితానికి (Near Death Experience) సంబంధించి, గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందిచారు ఆ ఛానల్ నిర్వహకులు. దోబారా జిందగీ అనే ఈ ప్రోగ్రాము అతి త్వరలో హిందీ ఛానల్ ప్రగ్య(ప్రజ్ఞ)లో రాబోతుంది.
దోబారా జిందగీ (రెండవ జీవితం) రెండు ఎపిసోడ్లు చూడగానే దిమ్మతిరిగి పోయింది నాకు. ఇటువంటి ప్రోగ్రాము మరొక్కటి ఎక్కడా కనలేదు, వినలేదు.
కొద్దో గొప్పో ఇన్ని సంవత్సరాలు దేశ విదేశాల్లోని అనేక ఆధ్యాత్మిక సంఘాల్లో తిరిగి అనేక మంది మాస్టర్లను కలిసి, పుస్తకాలు చదివి, స్వీయ రీసేర్చి చేసి, డాక్టర్ న్యూటన్, లక్ష్మి గార్ల వద్ద ట్రైనింగ్ పొందిన నాకు ఇలా అనిపిస్తే , మరి తెలుగు వారు… ముఖ్యంగా హిందీ రాని, టీవీ మాధ్యమం ఒక్కటి మాత్రమే కలిగిన పేద (తెలుగు) వారి సంగతేమిటి అని నాలో భావోద్వేగం కలిగింది.
తెలుగు జాతిలో పుట్టి తెలుగు వారి రుణం తీసుకోవడానికి ఇది చక్కని అవకాశం, ఇటువంటి అవకాశం మనకు ఎప్పుడు వస్తుందో అని నేను ఆవేదన పడుతుంటే, భార్యాభర్తలిద్దరూ (డా. న్యూటన్, డా. లక్ష్మి గార్లు) మొహాలు చూసుకున్నారు. అప్పటికి రెండు-మూడు రోజుల ముందే ‘మా టీవీ’ వాళ్ళకు వీలు కాదు అని చెప్పారట!
ఇటువంటి ప్రోగ్రాములను చిత్రీకరించడం అన్నది ఎంతో ప్రయాసతో కూడిన విషయం, ఒళ్ళు హూనం కావడం ఖాయం అన్నది డాక్టరు గారి ద్వారా అప్పటికే వినడం జరిగింది. మరి మన అదృష్టమో, తెలుగువారికోసం వారు వొళ్ళు-హూనం-త్యాగానికి మళ్ళీ సిద్ధపడ్డారో, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వెంటనే ఇండియాకు ఫోనే చేసి ఆ కార్యక్రమానికి అంగీకారం తెలిపారు.
ఆ తరువాత, ఈ కార్యక్రమం షూటింగ్ అఘమేఘాల మీద పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదల కాబోతుంది. ఇది నేను ఎంతో సంతోషంతో, గర్వంగా మీతో పంచుకోవాలనుకున్న విషయం.
ఫిబ్రవరి 11 వరకు ఎదురుచూడండి, తప్పక చూడండి, మిత్రులతో పంచుకోండి – మా టీవీలో వచ్చే గత జన్మ రహస్యం.
15 Comments
Gd eve sir..am sandhya frm anantapur..am abt to complete house surgeon in 2 mns..prgm chusanu 2 days bak.. very intrstng… i too want to kno abt my gata janma…ela possible sir idi? nammaleni nijam la undi…but 1yr daka nenu hyd relenu..me contact adres pampagalara..? k thanku sir
సంధ్య గారు, మీకు ఈమెయిల్ పంపించాను.
hello sir…..how r u?..nenu me program chhusanu…one hour varaku na feel chepalenu….entha bavundo program…naku 5 years nundi na last janma gurincchi telusukovalani asha…meru ekada vuntaru? address? naku urgent ga mimalni meet avvalani vundi………. please naku me nundi chala fast ga rply vastundani ashistunanu……………….bye sir thank you……….
Neeharika garu, I live in USA, East. You can contact the team at http://liferesearchacademy.com, Hyd, if you are in India.
Phone:+91-40-23554151, 23607597
sir program keka sir…drama bits chala bagunnai…seshaiah chowdary ata kadaa..fiction director..iraga teestunnadu sir..maro rajamouli…hats of cheppandi sir
nijamga super baboy cinma actorlani petti teeyyandi sir baguntadi..
keka
good job.this is not ordenery..extardinery
prog.is good.fiction iraga teestunnaru, maro rajamouli..seshaiah chowdary
gata janma prog.chusanu prathi varam chustunnanu..wednesday 9 to 10 vastundi..boxer ep. maa kalla venta neellu teppinchayi..raja episode lo yedari,neellakosam velle shots bits chuste magadheera malli chustunnama anipinchindi..really fantastic..wednesday kosam waiting,…kottaga undi…..seenaiah,nellore
hello sir…gud eveng….nenu maa t.v lo gatha janmma rahasyam programme choosanu…..nenu already 5 years nunchi pyramid dhayanam chesthunnanu. naku chala anubavalu vacchai but clear ga kanipinchadam ledu dhayaman lo….em cheyamantaru…..naku manchi suggestion evvanddi…..
ఎందుకు స్పష్టంగా కనిపించడం లేదు? అని ఒక ప్రశ్నను తలచుకొని, ఆ తరువాత ధ్యానం చెయ్యండి. మీకు కావలసిన సమాధానం వస్తుంది.
Hello sir,
Gata janma rahasyam programme chala chala bavundi. I want to know about my past life personally not on programme. Please send me your phone number n address. Meeru tappakunda naku reply estharu ani aasisthunnanu. Thank you………
Lakshmi.
ippati janma lo unna rahasyala ne telusu konte baguntudani maa abhiprayam
సరైన ఆలోచనే!