భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

భగవాన్ అనే పదానికి మూలపదం భాగ్యవాన్ అనే సంస్కృత పదం. తెలుగులో భగవంతుడు అంటే భాగ్యవంతుడు అన్న మాట.

నేను భాగ్యవంతుడిని (భగవంతుడిని) ఎందుకు కాదు? అనే ప్రశ్నను అప్పుడప్పుడు మనకు మనం వేసుకొని ఆలోచించాలి. అలా ఆలోచించడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది.

ఆధ్యాత్మిక గురువులను భగవాన్ అని పిలవడం భారతదేశంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ‘భగవంతుడు’ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవడం అన్నది ఎన్నో రకాలుగా భాగ్యాన్ని పొందడమే. నేను ఎవరు, ఏమిటి అన్నది తెలుసుకోవడం అన్నది కూడా అంతే ముఖ్యమైనది.

తాను ఏమిటో తెలుసుకున్న ప్రతివాడూ భాగ్యవంతుడే! తెలుసుకోని వాడు ఎంత సంపాదించినా కాలేడు!! పైగా ఒక గురువును విమర్శించడం ద్వారా మరింత అభాగ్యుడు అవుతాడు.

గౌతమ బుద్ధుడు 40 సంవత్సరాలు ఆధ్యాత్మిక సేవ చేశాడు. ఆయనను అందరూ భగవాన్ అని సంబోధించే వారు. బ్రతికున్నప్పుడు ఆయన మీద ఎన్నో ఆరోపణలు, కుట్రలు, హత్యా ప్రయత్నాలు జరిగాయి, శ్రద్ధగా నేర్చుకున్నవాడు బాగుపడ్డాడు, లేని వాడి ఇంకా కష్టాలు పడుతున్నాడు. శ్రీ కృష్ణుడిని కూడా భగవాన్ అనే సంబోధించారు. బ్రతికున్నప్పడు ఆయనకు కూడా ఇటువంటి సత్కారాలు తప్పలేదు… వేదాంతం అనగానే విపరీతమైన విమర్శలు, దాడులు.

అందుకే ఆధ్యాత్మిక బోధనలు అడవులకు తరలిపోయాయి. నిజంగా తెలుసుకోవాలి అనుకునే వాడికి కష్టసాధ్యం అయ్యాయి. అయితే “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” అని భగవద్గీతలో చెప్పినట్లు పట్టుబట్టి ప్రయత్నించిన వాళ్ళందరు కాలాతీతంగా తెలుసుకుంటూనే ఉన్నారు.

బాబా గారు కూడా తెలుసుకున్నారు. ఆయన భాగ్యవంతుడు. అయన తెలుసుకున్న సత్యాన్ని అతను చెప్పాడు. సంగీతం తెలిసిన వాడికి మాత్రమే మరొకడి సంగీతం అర్ధమవుతుంది. లెక్కలు కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు. అర్ధం కాకపోతే, రామానుజం ఫార్ములాలు పిచ్చివాడి గీతల్లా కనిపిస్తాయి [1], అందుకని మిడిమిడి జ్ఞానంతో మనం పళ్ళు ఇకిలించడం మానాలి. విషయం అర్ధం కావాలంటే అందులో పరిశోధన చేసి ఉండాలి, స్వానుభవం పొందాలి.

జీవితపు కడపటి క్షణాల్లో, మన జీవితాన్ని సింహావలోకనం చేసినప్పుడు అద్భుతంతో ఆహా అని ఆనందంతో ముందుకేగవచ్చు లేదా కోల్పోయిన అవకాశాలను చూసి ఓహ్ అని బాధపడవచ్చు. ఇంతటి మహత్తర జీవితానికి ఎంత ఆనందమో…

మానవసేవయే మాధవ సేవ అని నమ్మి ఆచరించిన మహనీయులలో ఆయన ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది జీవితాలకు స్పూర్తినిచ్చిన, ఇస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారికి నాగన్న వందనం, హాట్సాఫ్.

This entry was posted in సంసారం. Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

3 Comments

  1. Posted August 14, 2011 at 6:45 PM | Permalink

    నాగన్న గారూ నమస్కారమండీ.
    నా పేరు దాట్ల శ్రీనివాసరాజు. మీకు నేను బ్లాగులలో పరిచయం అయి ఉండవచ్చు.
    యూనీకోడ్ తెలుగులో కొత్త ఫాంట్లు తయారు చేసే కార్యంలో మీ సహాయం అవసరమైనది.
    మీకు అభ్యంతరం లేకపోతే మీ మెయిల్ చిరునామా గానీ ఫోన్ నంబర్ గానీ నాకు మెయిల్ చెయ్యగలరు.

  2. rathnamsjcc
    Posted November 29, 2011 at 5:21 AM | Permalink

    ఈ ఆత్మ కు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితిఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు గురువు చెబుతున్నారు. జీవనముక్తి మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” వున్నది. ఆత్మసూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు. అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి గురువుద్వారా నూతన పరిణామము తీసుకొని వచ్చింది. మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మ తారక మౌనయా గురువు మీద నమ్మకం ఉంటేనే జ్ఞానం లభిస్తుంది

    • నాగన్న
      Posted February 5, 2012 at 11:09 PM | Permalink

      బాగుంది రత్నం గారు.

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>