రాయక చాలా కాలం అయ్యింది.. వెబ్ సైటుకు వెళ్ళి చూడండి అని చెప్పడానికే మొహమాటంగా ఉంది… మళ్ళీ మొదలు పెట్టి ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేస్తాను…
మనందరం ఏం చెయ్యాలి అని జీవితంలో చాలా సార్లు ఆలోచిస్తాం… అలా చిస్తూనే ఉంటాం. అలా అలో’చించిన మీదట ఏ టీవీ ప్రోగ్రామో, పనికిమాలిన పని తగలకపోతే, అప్పుడు మనం అనుకున్న పనిని మొదలుపట్టే అదృష్టం జరుగుతుంది. అది పూర్తవుతుందా లేదా అన్నది తరువాత సంగతి.
నిజానికి మనం ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు చాలా సులభమైన సమాధానం ఒకటి ఎప్పుడూ ఉంటుంది, కానీ అంత సులభంగా తోచదు!
ఇప్పుడు నీవు చేస్తున్న మంచి పనిని కొనసాగించు, చెత్తది పరిత్యజించు
అందువలన మనం చేసే మంచి పనిని పక్కన పెట్టి, సమయాన్ని వృధా చేస్తాం. తెలుగులో రాయాలని నిర్ణయం తీసుకోని కొన్ని సంవత్సరాలు రాసే ప్రయత్నం చెయ్యడం అన్నది నా జీవితంలో ఒక గొప్ప అలవాటు, దాన్ని వదిలేయడం నిజంగా పెద్ద పొరపాటవుతుంది.
ఖాళీగా ఉన్న వాడి మెదడు, దయ్యాల కొంప – అన్న ఆంగ్ల నానుడి ప్రకారం, ఇలా రాయడం వల్ల కొంత జీవితకాలానికయినా పరిపక్వత వస్తుందనుకుంటాను.
బ్లాగు రాతలు – 4

…పట్టివిడుచుటకన్నా పడిచచ్చుటేమేలు, విశ్వదాభిరామ వినురవేమ.