About

తెలుగులో రాసుకోవడం అన్నది ఒకప్పుడు అవసరంలా అనిపించింది, ఆ తరువాత వ్యాపకంగా మారింది. ఇప్పుడు ఒక సాధనంగా కనిపిస్తుంది.

ఎప్పుడు ఎలా అనిపించినా, కనిపించినా రాసి ప్రచురించినప్పుడు కలిగే గొప్ప అనుభూతిలో మాత్రం పెద్దగా తేడా లేదు.

తెలుగు అక్షరాలలో కనిపించే నిండు అమ్మతనం నన్ను ఎల్లప్పుడు మురిపిస్తూనే ఉంది.

తెలుగు తల్లికి జేజేలు.